మహానాడు ఇచ్చిన జోష్ కొనసాగేనా ?

- Advertisement -

ప్రస్తుతం టీడీపీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల మహానాడు నిర్వహించి ప్రజల్లోకి వెళ్ళిన చంద్రబాబు.. మరింతగా ప్రజలకు దగ్గరయ్యే పనిలో ఉన్నారు. ప్రస్తుతం కొత్తగా ఏర్పడ్డ 26 జిల్లాలలో కూడా పర్యటిస్తూ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను టీడీపీకి సానుకూలంగా మార్చుకునే పనిలో ఉన్నారు. ఏది ఏమైనా మహానాడు సక్సస్ కావడంతో టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 26 జిల్లాలలో కూడా బస్సు యాత్ర చేపట్టే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు.

వైసీపీ ని ఎదుర్కోవాలంటే ఎక్కువ కాలం ప్రజల్లో ఉండడమే ఉత్తమం అని భావించిన చంద్రబాబు ఆ దిశగా అడుగులేస్తున్నారు. ముఖ్యంగా ఈ బస్సు యాత్ర ద్వారా వైసీపీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లనున్నారు. అయితే ఇక్కడ కొత్త చిక్కు ఏమిటంటే ఈ బస్సు యాత్ర ఎక్కడినుంచి ప్రారంభించాలి అనే విషయంపై టీడీపీ శ్రేణులు తర్జన బర్జన పడుతున్నారట. జగన్ కు షాక్ ఇవ్వాలంటే పులివెందుల నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభిస్తే బాగుంటుందని టీడీపీ లో కొందరి ఆలోచన.

- Advertisement -

ఎందుకంటే జగన్ కూడా టీడీపీ కంచుకోటగా ఉన్న కుప్పం లో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో.. చంద్రబాబు కూడా పులివెందులలో టీడీపీ జెండా ఎగురవేస్తే వైసీపీని దారుణంగా దెబ్బ తియ్యవచ్చు అనే ఆలోచనలో టీడీపీ శ్రేణులు ఉన్నారట. అందుకే బస్సు యాత్ర పులివెందుల నుంచి ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ పులివెందులలో వైసీపీ శ్రేణుల నుంచి ప్రతిఘటన ఎదురైతే.. జగన్ తన యాత్రను కావాలనే అడ్డుకుంటున్నాడనే సంకేతాలను ప్రజల్లో బలంగా ప్రస్తావించవచ్చు అని చంద్రబాబు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

Also Read

1.జగన్ కు గోల్డెన్ ఛాన్స్ ?

2.వాలెంటిర్లు జగన్ కు లాభామా ? నష్టమా ?

3.పవన్ పగటి కల నెరవేరుతుందా ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -