సలార్ మూవీపై క్రేజీ అప్‌డేట్

ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీస్‌లో సలార్ ఒకటి. ఇతర సినిమాలతో ప్రస్తుతం బాహుబలి బిజీగా ఉన్నా.. అన్నింటికన్నా ముందుగా రిలీజ్ కాబోతున్నది సలార్ అని తెలుస్తోంది. దీంతో సలార్ అప్‌డేట్స్‌ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.

సలార్ మూవీకి ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. కేజీఎఫ్ 1, కేజీఎఫ్‌ 2తో పాన్ ఇండియా రేంజ్‌ లో ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ నీల్ సలార్‌ను తెరకెక్కిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సలార్‌లో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. జులై రెండో వారంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలతో టీజర్‌ను రిలీజ్ చేయాలని మూవీ టీమ్ భావిస్తోంది.

Also Read

1.సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

2.పుష్ప 2 సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న బన్నీ

3.గెస్ట్ రోల్ లో మహేశ్ బాబు..

Related Articles

Most Populer

Recent Posts