‘టాలీవుడ్’లో ఎవర్ గ్రీన్ ప్రేమ కథ చిత్రాలు ఇవే!

Evergreen Love Story Movies in Tollywood
Evergreen Love Story Movies in Tollywood

ప్రేమ అనే రెండు అక్షరాలు పదాన్ని వివరించాలంటే ఎన్ని పదాలైనా సరిపోవు. ప్రేమ ఎప్పుడు ఎవరిలో ఏ విధంగా పడుతుందో.. ఏ విధంగా అంతమవుతుందో ఎవరికీ తెలియదు. ఒకప్పుడు ప్రేమ కోసం ప్రాణత్యాగం చేసిన ఎంతో మంది ప్రేమికులు ఉన్నారు. ఎన్ని సౌకర్యాలు ఉన్నా.. ప్రేమ లేనిదే బ్రతుకుతున్న తృప్తి కూడా ఉండదు’… ఆగండి… ఆగండి.. ఈ పదాలు తరచూ వింటూ ఉంటాం.

ఈ విధమైనటువంటి డైలాగులు మన తెలుగు సినిమాలు ఎంతో ఆదరణ పొందాయి. మన తెలుగు సినిమాల్లో.. ప్రేమని వర్ణించిన తీరు అలా ఉంది మరి. ఎన్ని కమర్షియల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు వచ్చినప్పటికీ ప్రేమ కథలకు ఉండే ఆధారణే వేరు. ప్రేమ పేరుతో వచ్చే పాటలు కూడా వినడానికి ఎంతో మంది ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే మన తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ ప్రేమ కథ చిత్రాలు ఎల్లప్పుడు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరి ఆ చిత్రాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

అక్కినేని నాగేశ్వరరావు నటించిన దేవదాసు, ప్రేమ్ నగర్, ఎన్టీఆర్ ఆరాధన, కమల్ హాసన్ మరో చరిత్ర, నాగార్జున మజ్ను, గీతాంజలి, వెంకటేష్ ప్రేమ, పవన్ కళ్యాణ్ తొలిప్రేమ, సుస్వాగతం, ఖుషి, తరుణ్ నువ్వే కావాలి, మహేష్ బాబు ఒక్కడు, వర్షం, మనసంతా నువ్వే, గులాబీ, ప్రేమికుల రోజు, ఏం మాయ చేసావే వంటి సినిమాలు ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ ప్రేమ కథ చిత్రాలుగా చెప్పవచ్చు.

Also Read: బాలకృష్ణ తన కెరియర్లో వదులుకున్న సినిమాలివే?