Thursday, April 25, 2024
- Advertisement -

బాలకృష్ణ తన కెరియర్లో వదులుకున్న సినిమాలివే?

- Advertisement -

నందమూరి హీరోగా ఎన్నో చిత్రాలలో విభిన్నమైన పాత్రలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న బాలకృష్ణ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను తిరగరాశారు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించిన బాలకృష్ణ కొన్ని అనివార్య కారణాల వల్ల విజయవంతమైన సినిమాలను కూడా వదులుకున్నారు.మరి బాలకృష్ణ కెరియర్ లో వదులుకున్న ఆ సూపర్ హిట్ సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

బజారు రౌడీ: బాలకృష్ణ కోసం దర్శకులు ఈ సినిమాను రాయగా కొన్ని అనివార్య కారణాలతో బాలకృష్ణ ఈ సినిమాను వదులుకున్నారు. తరువాత ఈ సినిమాలో కృష్ణ కొడుకు రమేష్ బాబు నటించిన మంచి విజయం సాధించారు.
జానకి రాముడు: కోడి రామకృష్ణ,బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా నుంచి కోడి రామకృష్ణ తప్పుకోవడంతో బాలయ్య బాబు కూడా సైడ్ అయ్యారు.. ఈ క్రమంలోనే ఈ సినిమాలో నాగార్జున నటించిన సూపర్ హిట్ అందుకున్నారు.
చంటి: చంటి కథ విన్న తర్వాత బాలకృష్ణ కథ నచ్చలేదని రిజెక్ట్ చేయడంతో వెంకటేష్ ఈ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు.

సూర్యవంశం: వెంకటేష్ ద్విపాత్రాభినయంలో నటించిన ఈ సినిమాను పెద్దన్నయ్య కథను పోలి ఉందని బాలకృష్ణ రిజెక్ట్ చేశారు.
సీతయ్య: చెన్నకేశవరెడ్డి సినిమాతో బిజీగా ఉండటంవల్ల సీతయ్య సినిమాను వదులుకున్నారు.
సింహాద్రి: సింహాద్రి కథను బాలయ్య కోసమే రచించగా ఈ కథ తనకు సూటయ్యేది కాదని బాలకృష్ణ వదులుకున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.
శివరామరాజు: ఈ సినిమాలో హరికృష్ణ పాత్ర కోసం బాలయ్యను సంప్రదించగా తక్కువ నిడివిగల పాత్ర కావడంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.ఈ విధంగా బాలకృష్ణ తన కెరీర్ లో సూపర్ హిట్ చిత్రాలను వదులుకున్నారని చెప్పవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -