Wednesday, April 24, 2024
- Advertisement -

ఈ జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ రాదట!

- Advertisement -

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధించే సమస్య డయాబెటిస్ (షుగర్ వ్యాధి). ఈవ్యాధిని మొదట్లోనే గుర్తించగలిగితే కొంత వరకు అదుపు చేయవచ్చు. కొంత మందిలో షుగర్ వ్యాధి లక్షణాలు ఉన్నా వాటిని గుర్తించడం కష్టం. షుగర్ వ్యాధికి మూల కారణం క్లోమ గ్రంధిలోని బీటా కణాలు పెరిగిన గ్లూకోస్ స్థాయిలను అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే. అంటే శరీరంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగినప్పుడు దానిని కంట్రోల్ చేసే సామర్ధ్యం శరీరానికి లేనప్పుడు షుగర్ వ్యాధి వస్తుంది.

షుగర్ వ్యాధి వచ్చిందంటే జీవిత కాలం మందులు వాడాల్సిందే. అయితే షుగర్ వ్యాధి ఎవరిలో వచ్చే ప్రమాదం ఉందో కొన్ని ముందస్తు లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. ఏవైనా గాయాలు అయినప్పుడు త్వరగా మానకపోవడం, హఠాత్తుగా బరువు తగ్గడం, కంటి చూపు మందగించడం,కాళ్లకు తరచూ తిమ్మిర్లు రావడం, పళ్ళు ఊడిపోవడం వంటి సమస్యలతో బాధపడుతుంటే వెంటనే డాక్టర్ను సంప్రదించి షుగర్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం.

డయాబెటిస్ వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఎక్కువగా షుగర్ వ్యాధి రావటానికి ప్రధాన కారణం ఒంట్లో శక్తిని ఖర్చు చేయకపోవడమే. అందుకే కొంత శారీరక శ్రమ కలిగిన వ్యాయామం, నడక ప్రతి రోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే డయాబెటిస్ లాంటి ప్రమాదకర వ్యాధులు మన దరిచేరవు.వీటితో పాటు ఆహారంలో సాధ్యమైనంతవరకు చక్కెర శాతాన్ని తగ్గించుకోవాలి. ఫైబర్, ఐరన్, మెగ్నీషియం ఎక్కువగా ఉండే చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం ఉత్తమం. అతిగా ఆహారాన్ని తీసుకునే అలవాటు మానుకోవడం.జంక్ ఫుడ్ ,ఫాస్ట్ ఫుడ్, ధూమపానం మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండటం.కొన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించినట్లయితే ప్రమాదకర షుగర్ వ్యాధి బారిన పడకుండా రక్షించుకోవచ్చు.

Also Read: పాలను ఫ్రిజ్ లో పెట్టవచ్చా… పెట్టే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -