ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాలకుల్ని ప్రశ్నించేందుకు, నడిరోడ్డుపై నిలదీసేందుకు ఎప్పుడైతే జనసేన ఉదయించిందో.. అప్పటి నుంచి రాజకీయాలో మార్పు వచ్చింది. జనం ముందు ఒకటి.. లోపల మరొకటి చేయడం కాకుండా ముందుకు వెళ్తుంది జనసేన. సమస్య ఎందుకు పరిష్కరించరో చెప్పండి.. హామీ ఎందుకు ఇచ్చారో చెప్పండి.. అంటూ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో ప్రశ్నించాడు.
అంతేకాకుండా.. జనం కోసం ఎంతటికైన పోరడాటానికి పవన్ ఎప్పుడు ముందే ఉంటున్నాడు. ఇదిగో సమస్య.. ఇక్కడ జనం ఇబ్బందులు పడుతున్నారు అని పవన్ తెలుసుకోవడమే ఆలస్యం అక్కడికి వెళ్లి ప్రజల కోసం పోరడుతాడు. ఏఏ ప్రాంతాల్లో జనం ఆగచాట్లు పడుతున్నారో ఆ లిస్టు అంతా తయారు చేసి వాటిపై పవన్ ఏం చేయాలో నిర్ణయం తీసుకోబోతున్నాడు. అధికారం.. ఓట్ల గురించి జనసేన ఆలోచించకుండా ప్రజసేవే ముఖ్యంగా ముందుకు వెళ్తోంది జనసేన. ఈ విషయంలో జనసేనను ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు.
ఇక జనసేన పార్టీ.. త్వరలో జనసమస్య.కామ్ అనే వెబ్ సైట్ ను లాంచ్ చేయబోతుంది. అయితే ఈ వెబ్ సైట్ కోసం అప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రిపోర్టలను జనసేన తీసుకోబోతుంది సమాచారం. అయితే ప్రజల సమస్యలపై.. రాష్ట్రంలో జరుగుతున్న అవినితీపై ఈ వెబ్ సైట్ లో జనసేన మాట్లడబోతుంది. ఇక 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పవన్ ఓ అడుగు ముందుకు వెసాడని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో తమ పార్టీకి కావాల్సిన అన్ని అంశలను కుదుర్చుకునేందుకు పవన్ ఈ విధంగా చేస్తున్నాడని రాజకీయా విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైన ప్రజసమస్య.కామ్ ద్వారా జనసేన కు ఉపయోగం ఉంటుందో లేదో వేరే సంగతి కానీ.. ప్రజల సమస్యలపై పోరడితే ప్రజలకు మంచి జరగొచ్చు అని అంటున్నారు.
{loadmodule mod_sp_social,Follow Us}
Related