పవన్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రాశి

Raasi Remembers Meeting With Pawan Kalyan

భారీ అందాలతో.. ముద్దు ముద్దుగా ఉంటూ యూత్ ని ఒక ఊపు ఊపేసింది రాశి. పెరిగిన వయసుతో రాశి తల్లి క్యారెక్టర్స్ చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గోకులంలో సీత సినిమాలో తళుక్కున మెరిసిన ఈమె.. తాజాగా నాటి మెమరీస్ ను గుర్తు తెచ్చుకుంది. రీసెంట్ గా లంక మూవీలో నటిస్తోన్న ఆమె.. 75 సినిమాల్లో తానిప్పటికి నటించానని.. వాటికి భిన్నమైన రోల్ లంకలో చేసినట్లుగా చెప్పింది.

కల్యాణ వైభోగం సినిమాలో హీరోయిన్ తల్లి పాత్ర ఆఫర్ వచ్చినప్పుడు ముందు నో చెప్పిన తర్వాత కథ విని ఓకే చెప్పానని చెప్పింది రాశి. ఈ మధ్యన జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. తమ పాప బర్త్ డే సందర్బంగా పవన్ కల్యాణ్ ను కలవటానికి వెళ్లానని.. తీరా ఆయన వద్దకు వెళ్లాక.. అపాయింట్ మెంట్ తీసుకున్నారా? అని అడిగారని.. తాను వచ్చిన విషయం పవన్ కు తెలీలేదన్నారు. తాను బయట వెయిట్ చేశానని.. తర్వాత తెలిసి.. వెంటనే పిలిపించి చాలాసేపు మాట్లాడారని.. తాను పవన్ తో మాట్లాడిన సమయాన్ని మర్చిపోలేనన్నారు.

గోకులంలో సీత సమయంలో కంటే కూడా తాజాగా కలిసినప్పుడే ఎక్కువసేపు మాట్లాడారంటూ రాశి చెప్పిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఒకప్పటి హీరోయిన్.. తాను జత కట్టిన హీరోను కలవటానికి వెళ్లినప్పుడు వెయిట్ చేయాల్సి రావటం ఇబ్బందికరమే. అయితే.. పవన్ కలిసిన సంతోషం.. ఆ వెయిటింగ్ను మర్చిపోయేలా చేయటం రాశి గొప్పతనమా? పవన్ మేజిక్కా?

{youtube}p5WKmZvyH1Q{/youtube}

Related

  1. అయ్యో.. స్టార్ హీరోయిన్.. చివరికి ఇలా..
  2. వ్యభిచారం అడ్డంగా పట్టుబడ్డ హీరోయిన్
  3. ఖైదీ మూవీ విలన్ భార్య తెలుగు స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా..?
  4. హీరోయిన్ చాన్స్ కోసం కాజల్ ఎలాంటి పనులు చేసిందో తెలుసా..?