విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలే.. రెండు భారీ ప్రాజెక్టులు !

Big Project Movies in Vijay Devarakonda Hand
Big Project Movies in Vijay Devarakonda Hand

రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు నిన్న మొన్నటి దాకా టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు చాలా గట్టిగా వినిపించింది. అయితే ” లైగర్ ” డిజాస్టర్ కావడంతో ఒక్కసారిగా విజయ్ సైలెంట్ అయిపోయాడు. ఒకవేళ లైగర్ హిట్ అయిఉంటే ఈపాటికే విజయ్ పేరు పాన్ ఇండియా లెవెల్ లో మారుమ్రోగి ఉండేది. ఇక లైగర్ ఫ్లాప్ తో విజయ్ అప్ కమిగ్ మూవీస్ కూడా డైలమాలో పడ్డాయి. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ” ఖుషీ ” మాత్రమే చేస్తున్నాడు. ఖుషీ తరువాత వాట్ నెక్స్ట్ అంటే చెప్పడం కష్టమే. .

ఎందుకంటే లైగర్ రిలీజ్ కాకముందే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ” జనగణమన ” అనౌన్స్ చేశాడు విజయ్ దేవరకొండ. అయితే లైగర్ ఫ్లాప్ తరువాత ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ గా ఆగిపోయింది. ఇక ఆ తరువాత సుకుమార్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నట్లు విజయ్ దేవరకొండ గతంలోనే ప్రకటించాడు. కానీ ఇప్పుడు సుక్కు ఈ ప్రాజెక్ట్ ఏమంత ఆకక్తిగా లేరని ఫిల్మ్ నగర్ ఇన్ సైడ్ టాక్. అయితే తెలుగు దర్శకులు విజయ్ తో మూవికి సిద్దంగా లేనప్పటికి.. బాలీవుడ్ మేకర్స్ మాత్రం విజయ్ తో మూవీ చేసేందుకు అమితంగా ఆసక్తి కనబరుస్తున్నారట.

లైగర్ ఫ్లాప్ అయినప్పటికి హిందీ ఆడియన్స్ లో విజయ్ క్రేజ్ గట్టిగానే ఉంది దాంతో రౌడీ క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు బాలీవుడ్ మేకర్స్. ఇప్పటికే బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ విజయ్ తో ఓ భారీ మూవీ తెరకెక్కించేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇక షారూఖ్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ కూడా విజయ్ తో ఓ సినిమా చేసేందుకు సిద్దమైందని నార్త్ ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ లు పట్టాలేక్కితే రౌడీ హీరోని నార్త్ లో స్టాండెడ్ క్రేజ్ ఏర్పడడం ఖాయం. మరి ఈ వార్తలు నిజమౌతయా ? లేదా రూమర్స్ గానే మిగిలిపోతయా ? అనేది చూడాలి.