Saturday, May 4, 2024
- Advertisement -

మూవీ పాలిటిక్స్.. ఇదే గురూ మన ట్రెండు !

- Advertisement -

రాజకీయాలు అనేది ఎప్పుడు ఒకేలా ఉండవు. ఎప్పటికప్పుడు కొత్త రూపు సంతరించుకుంటూ ఉంటాయి. ఒకవిధంగా చెప్పాలంటే రూపాంతరం చెందుతూ ఉంటాయి అని చెప్పవచ్చు. కానీ ఏదైనా ఒక పార్టీకి చెందిన నేతలు ఇతర పార్టీని లేదా పార్టీ నేతలను డీగ్రేడ్ చేయడం మాత్రం రాజకీయాల్లో ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఎందుకంటే ఒక పార్టీని తక్కువ చేసినప్పుడే మరో పార్టీ బలపడుతుంది. అలా ఒక పార్టీ పూర్తి స్థాయిలో బలపడాలంటే పబ్లిసిట్ చాలా అవసరం. అందుకే రాజకీయ నాయకులు పబ్లిసిటీ కి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈ పబ్లిసిటీ అనేది మరి ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.

ఫ్లెక్సిలతోనూ, బ్యానర్ లతోనూ, టీవి యాడ్స్ లతోనూ ఇలా నానా రకాలుగా పబ్లిసిటీ చేస్తూ పార్టీపై ప్రజల్లో హైప్ పెంచుతూ ఉంటారు పోలిటికల్ లీడర్స్. ఇక ప్రస్తుతం ఈ పబ్లిసిటీ అనేది కొత్త పుంతలు తొక్కుతోంది. ఏపీలో ఎన్నికలకు ఏడాదిన్నర టైమ్ మాత్రమే ఉండడంతో పబ్లిసిటీపై ఇప్పటి నుంచే ఫోకస్ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఇటీవల రాంగోపాల్ వర్మ ఏపీ సి‌ఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే భేటీ అనంతరం వ్యూహం, శపథం అనే రెండు మూవీస్ ను అనౌన్స్ చేశారు రాంగోపాల్ వర్మ. వాటిలో వ్యూహం అనేది టీడీపీకి వ్యతిరేకంగా చంద్రబాబు టార్గెట్ గా తీయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -