శర్వానంద్ పెళ్లి.. వధువు ఎవరంటే?

Tollywood actor Sharwanand is getting married soon!
Tollywood actor Sharwanand is getting married soon!

టాలీవుడ్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌తో నిండిపోయింది. వారిలో నటుడు శర్వానంద్ ఒకరు. అ మద్య బాలయ్య ఆన్ స్టాపబుల్ షో లో నటుడు ప్రభాస్ పెళ్లి చేసుకున్నాకే తాను కూడా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి పెళ్లి విషయాన్ని పక్కన పెట్టాడు. అయితే ఇప్పుడు శర్వానంద్ పెళ్లి పీటలెక్కాల్సిన సమయం ఆసన్నమైంది.

అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న హైదరాబాద్‌ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎన్నారై అమ్మాయిని శర్వానంద్ త్వరలో పెళ్లి చేసుకోబోతోన్నాడట. అమె కొన్ని నెలల క్రితం వరకు అమెరికాలో నివసిస్తున్నారు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా హైదరాబాద్‌లోనే ఉంటోందట. అయితే ఇది పెద్దలు కుదిర్చిన వివాహాం మాత్రమే కాదని, తాను ప్రేమించిన అమ్మాయినే ఇలా అరెంజ్డ్‌ మ్యారెజ్‌గా సెట్ చేశాడని తెలుస్తోంది.

శర్వానంద్ విజయవాడలోని తాతగారింట్లో జన్మించాడు. నాన్న ప్రసాదరావు వ్యాపారవేత్త. అమ్మ వసుంధరాదేవి గృహిణి. అన్నయ్య కల్యాణ్, అక్క రాధిక.. పెరిగింది మాత్రం హైదరాబాద్‌లో. బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం చేశాడు. అప్పుడు రాణా దగ్గుబాటి, రాంచరణ్ తేజ ఇతని క్లాస్‌మేట్స్‌గా ఉండేవాళ్లు. 38 సంవత్సరాలు ఉన్నా శర్వానంద్ దాదాపు 15 సంవత్సరాలుగా సిమాల్లో స్టార్‌ హీరో గా స్థిరపడ్డాడు.

ఇవి కూడా చదవండి

మెగాస్టార్ పూరీ కాంబినేషన్ ఫిక్స్..!

బాలయ్య షో లో మంత్రి కెటిఆర్, రామ్ చరణ్?

సరిగా నిద్రపోవడం లేదా..? అయితే మీకు..!