రామ్ చరణ్ RC15 ఫస్ట్ లుక్ పోస్టర్…

RC15 First Look Poster on Ram Charan's Birthday
RC15 First Look Poster on Ram Charan's Birthday

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం డైనమిక్ డైరెకర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని తెలుగు బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక డైరెక్టర్ శంకర్ కు నేషనల్ వైడ్ గా ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇక ఆర్ ఆర్ ఆర్ తో రాంచరణ్ క్రేజ్ కూడా పాన్ ఇండియా స్థాయిలో విస్తరించింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ” RC15 ” పై భారీ అంచనాలే నెలకొన్నాయి.

అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాను అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నారట డైరెక్టర్ శంకర్. ఈ మూవీకి సంబంధించి లీకైనా ఫిక్స్, వీడియో క్లిప్స్ మూవీపై మరింత హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఈ మూవీలో చరణ్ ను రెండు విభిన్న పాత్రలలో చూపించబోతున్నాడట శంకర్. ఒకటి 50 ఏళ్ల వయసున్న తండ్రి పాత్ర కాగా మరోటి కొడుకు పాత్ర.. అయితే ఇంకో పాత్ర కూడా ఉందని ఆ పాత్రలో చరణ్ విలన్ రోల్ లో కనిపిస్తాడనే గుసగుసలు ఫిల్మ్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నాయి.

పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రామ్‌చరణ్‌ బర్త్ డే కానుకగా మార్చి 27న ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్టుగా తెలిసింది. దీనిపై అధికారిక క్లారిటీ తొందరలోనే రానున్నట్టుగా సమాచారం. ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జంటగా కియారా అద్వానీ సందడి చేయబోతోంది. థమన్ సంగీతం అందిస్తుంన్నారు. అయితే దిల్ రాజు బ్యానర్ లో 50 వ చిత్రంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అందం మార్చుకున్న హీరోయిన్స్ వీరే!!

పుష్ప 2 లో జగ్గూభాయ్…

జబర్దస్త్ రైటర్ కి నాగ్.. బంపర్ ఆఫర్ !