Monday, April 29, 2024
- Advertisement -

పుష్ప 2 లో జగ్గూభాయ్…

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ” పుష్ప పార్ట్ 2 ” . క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత సంవత్సరం వచ్చిన ” పుష్ప ” మూవీ దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలన విజయం సాధించిదో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా హిందీలో దాదాపు 300 కోట్ల వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. దాంతో ” పుష్ప పార్ట్ 2 ” కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే లీక్ అవుతున్న కొన్ని వార్తలు మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

ఈ మద్యనే షూటింగ్ ప్రారంభం అయిన ఈ మూవీకి సంబంధించి ఓ వార్త ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది. అదేమిటంటే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో జగపతిబాబు నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 20 రోజులపాటు విశాఖ షిప్ యార్డ్, పోర్టు ఏరియాలో సినిమా షూటింగ్ జరగనుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో మొదలయ్యే భారీ షెడ్యూల్ లో జగపతిబాబు పాల్గొంటాడని తెలుస్తోంది. అతని క్యారెక్టర్ వివరాలను చివరి వరకు సస్పెన్స్ లో పెట్టాలని చిత్రయూనిట్ నిర్ణయించుకున్నారట. ఇదే గనుక నిజం అయితే అల్లు అర్జున్ మరియు జగపతిబాబు మద్య వచ్చే సీన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

మరిన్ని వార్తాలు

జబర్దస్త్ రైటర్ కి నాగ్.. బంపర్ ఆఫర్ !

ఎన్టీఆర్ కోసం ప్లాన్ మార్చిన కొరటాల !

క్యాన్సర్‍తో పోరాడి గెలిచిన సెలబ్రిటీలు వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -