పవన్ సినిమాల్లోనే హీరో… రాజకీయాల్లో కాదు…

Mudragada Padmanabham Challenge to Pawan Kalyan
Mudragada Padmanabham Challenge to Pawan Kalyan

ఇప్పుడిప్పుడే రుతుపవనాలు వస్తు వాతావరణ చల్ల పడుతుంటే ఆంధ్రప్రదేశ్‍లో మాత్రం ఎన్నికల వేడి మొదలైంది. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో కాపు రాజకీయం తెరపైకి వచ్చింది. ముద్రగడ పద్మనాభం వర్సెస్ పవన్ కళ్యాణ్ వార్ కొనసాగుతోంది.

ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రెండవ లేఖ రాశారు. 3 పీజీలతో 30 ప్రశ్నలు సందిస్తు ఘటుగా లెఖ రాశారు. పవన్ బెదిరింపులకు భయపడేది లేదు. కాకినాడ వద్దనుకుంటే పిఠపురంలో తనపై పోటీకి రావాలని సవాల్ విరిచారు. పవన్ సినిమాల్లోనే హీరో… రాజకీయాల్లో కాదు… అంటూ కామెంట్స్ చేశారు.

3 పీజీలతో 30 ప్రశ్నలు

మీ అభిమానిలతో తిట్టించాల్సిన అవసరం ఏముంది..?
నేనేం నీ దగ్గర నౌకరీ చేయడంలేదు..?
నేను మీకు తొత్తుగా ఉండాలా.. ?
మీకు నాకు సంబంధమేంటి..?.
నాకు సొంత అభిప్రాయాలు ఉండకూడదా..?
మీరు ఏమమ్మా నేను పడాతునన్న గర్వమా..?
రంగా హత్య కేసు నిందితులను పలకరించారా..?
వాళ్ల కుటుంవాలను ఏరోజైనా పరామర్శించారా..?
జైల్లో ఉన్నవాళ్లకు బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నించారా..?
1988నాటి కాపు కేసులపై అప్పటి సీఎంతో మాట్లాడారా..?
1993లో కాపులను చావబాదిన వ్యవహారంపై స్పందించారా..?
1997లో కాపు ఉదమ్యకారులపై కేసులు ఎత్తేయమని కోరారా..?
2016 తుని ఘటన బాధితులను పలకరించారా..?
తుని ఘటన కేసులను జగన్ ఎత్తేసినట్లు మీకు తెలీదా..?
కాపు కులాన్ని నేను స్వార్థం కోసం వాడుకుంటున్నానా?
గోచీ, మొలతాడు లేనివాళ్ల్తో తిట్టిసే ఏం ఉపయోగం.
కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా..?
జిల్లాకు అంబేద్కర్ పేరి విషయమై కాపులపై కేసులు లేవా..?
నిత్యం మిమ్మల్నే స్మరించే వాళ్ల కోసం మీరెందుకు వెళ్లరు?
మీ కోసం అందరూ రోడ్డు మీదకు రావాలా..?
రోడ్డు మీదకు వచ్చిన వాళ్లకు ఆపద వస్తే పట్టించుకోరా..?
మీ సినిమాలకు ఫ్యాన్స్ కి వేలాది రూపాయలు ఖర్చు ఎందుకు?
నన్ను పోలీసులు బూటుకాళ్లతో తన్నినప్పుడు మీరెక్కడ..?
మీ బాంచెన్‍దొర అనకపోతే నన్ను తిడతారా..?
నా ఫ్యామిలీని బూతులు తిడితే మీరేమైపోయారు..?
కాకినాడ ఎమ్మేల్యేతో కలసి నన్నెందుకు తిట్టారు..?
కాకినాడ నుంచి పోటీచేసే ధైర్యం మీకు ఉందా..?
కాకినాడ వద్దనుకుంటే పిఠాపురం నుంచి పోటీ చేస్తారా..?
నన్ను మీకు పోటీగా రమ్మని సవాల్ విసరగలరా..?
మీ వాళ్లతో తిట్టించి నన్ను పోటీకి లాగుతున్నారా..?