ఉదయనిధి స్టాలిన్…ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు. కరుణానిధి మనవడిగా, సీఎం స్టాలిన్ తనయుడిగా రాజకీయ ఆరంగేట్రం చేశారు ఉదయనిధి స్టాలిన్. ప్రస్తుతం స్టాలిన్ కేబినెట్‌లో మంత్రిగా కూడా ఉన్నారు. రీసెంట్‌గా సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారి తీశాయి. సనాతన ధర్మం అటే డెంగ్యూ, మలేరియా లాంటిదని దానిని పూర్తిగా నిర్మూలించాలని సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో ఉదయనిధిపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. ఉదయనిధి తలపై ఏకంగా రూ.10 కోట్ల నజరానా ప్రకటించాయి. అంతేగాదు ఉదయనిధిని చెప్పుతో కొడితే రూ. 10 లక్షలు ఇస్తామని పోస్టర్లు కూడా వెలిశాయి. ఇక యూపీలో ఆయనపై పోలీస్ కేసు నమోదైంది. అయితే ఉదయనిధి ఏమాత్రం తగ్గడం లేదు.
తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ ఆ మాటలకు కట్టుడి ఉన్నానని తనను చంపడానికి రూ. 10 కోట్లు స్వామిజీలకు ఎక్కడినుండి వస్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఇంతవరకు బాగానే ఉన్నా తాజాగా మరో బాంబు పేల్చారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించకుండా తీవ్రంగా అవమానించిందని.. ఇది కుల వివక్షకు ఉత్తమ ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.
ఏకలవ్యుడు తక్కువ కులానికి చెందినవాడు కావడంతో.. ద్రోణాచార్యుడు అతనికి విలువిద్య పాఠాలు నేర్పించేందుకు నిరాకరించాడని అయితే ఏకలవ్యుడు స్వతహాగా విలువిద్యను అభ్యసించి, ద్రోణాచార్యుని శిష్యుడైన అర్జునుడి కంటే నైపుణ్యం కలిగిన విలుకాడు అయ్యాడని గుర్తు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ద్రోణాచార్యుడు కోపాద్రిక్తుడై.. తన బొటనవేలుని కానుకగా ఇవ్వాలని ఏకలవ్యుడిని కోరాడన్నారు. రాష్ట్రపతి ముర్ము విషయంలోనూ కేంద్రం అలాగే వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పించారు. అసలు ఉదయనిధి అంటేనే భగ్గుమంటున్న హిందూ సంఘాలు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందిస్తాయో వేచిచూడాలి..