సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న యంగ్ హీరో

- Advertisement -

తమిళనాడు సీఎం తనయుడు, యువ హీరో ఉదయనిధి స్టాలిన్.. తన సినీ కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. హీరోగా పలు సినిమాల్లో నటించి హిట్ అందుకున్నాడు. అయితే స్టార్‌డమ్ మాత్రం ఇంకా దక్కించుకోలేదు. ఇలాంటి తరుణంలో సినిమాల్లో నటించడం మానేస్తానంటూ ఉదయనిధి ప్రకటించాడు. గత ఎన్నికల్లో ఉదయనిధి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు.

తండ్రి అడుగు జాడల్లో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారాలని భావిస్తున్న అతడు అప్పుడే సినీ ప్రస్థానానికి పుల్ స్టాప్ పెడతాడని అంతా భావించారు. అయితే ముందుగా కమిట్ అయిన సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకున్నాడట. ప్రస్తుతం ఉదయనిధి మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు. బాలీవుడ్ చిత్రం ఆర్టికల్ 15 కు తమిళ రీమేక్ నెంజుకు నీధిలో నటించాడు.

- Advertisement -

ఈ సినిమా మే 20న విడుదల కానుంది. దీంతో పాటు ‘మామన్నన్’ అనే చిత్రం కూడా చేస్తున్నాడు. ఈ సినిమాకు సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే అదే తన చివరి చిత్రమని తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ఉదయనిధి స్వయంగా ప్రకటించాడు.

మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?

50 ఏళ్ళ దగ్గర పడుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -