Friday, April 26, 2024
- Advertisement -

సీఎం కుమారుడికి జోడీగా ఇస్మార్ట్​ భామ..!

- Advertisement -

ఇస్మార్ట్​ శంకర్​ మూవీతో తెలుగులో సూపర్​ హిట్ కొట్టింది హీరోయిన్ నిధి అగర్వాల్​. ఈ సినిమాలో ఈమె అందాల ఆరోబోతకు యూత్​ ఫిదా అయిపోయింది. ఇక ఆ తర్వాత ఆమె తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆశించిన సక్సెస్​ రాలేదు. కానీ టాలీవుడ్​లో బిజీ నటిగా మారిపోయింది. ఇదిలా ఉంటే కోలీవుడ్​లోనూ పలు సినిమాల్లో నటించి తమిళులకు కూడా దగ్గరైంది.

జయం రవి భూమి, శింభూ ఈశ్వరన్​లో నటించి మెప్పించింది. దీంతో తమిళనాట మంచి ఫాలోయింగ్​ ఏర్పరచుకున్నది నిధి. ఇదిలా ఉంటే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​ కుమారుడు ఉధయనిధి స్టాలిన్​ తో నటించే చాన్స్​ కొట్టేసింది నిధి అగర్వాల్.
ఉదయనిధి స్టాలిన్ స్వంత ప్రొడక్షన్ అయిన రెడ్ జెయింట్ మూవీస్ త్వరలో ఓ మూవీ తెరకెక్కబోతున్నది. ఈ సినిమాలో హీరోయిన్​గా నిధిని ఫిక్స్​ చేశారు.

ప్రస్తుతం పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​ హీరోగా నటిస్తున్న చారిత్రక మూవీ హరిహర వీరమల్లులో నిధి హీరోయిన్ గా నటిస్తోంది. తమిళనాడులో స్టాలిన్​ కుటుంబానికి అక్కడి సినిమా ఇండస్ట్రీపై తిరుగులేని ఆధిపత్యం ఉంటుంది. వారి బ్యానర్​లో నటించే చాన్స్​ కొట్టేయడం అదృష్టంగానే భావిస్తున్నారు నటీనటులు. ఉదయనిధి పక్కన చేసే చాన్స్​ను నిధి కొట్టేసిందని తమిళసినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read

సూపర్ హిట్ సైకో థ్రిల్లర్ మూవీ కి సీక్వెల్..!

క్లాసిక్ ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్..!

రామ్ ను ఢీకొట్టే పాత్రలో తమిళ స్టార్ హీరో..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -