- Advertisement -

ఈసారి సంక్రాంతి సినిమాల సందడే!

- Advertisement -

ప్రతిసారి లాగే ఈసారి సంక్రాంతి సినిమాల సందడితో కన్నుల పండుగ కానుంది. సాధారణంగా సంక్రాంతి అంటే పందెం కోళ్లే కాదు సినిమాల సందడి ఉంటుంది. అందుకే సంక్రాంతి రేసులో సినిమాలంటే మూములు క్రేజ్ ఉండదు. ఈ క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు దర్శక, నిర్మాతలు ఉవ్విళ్లూరుతుంటారు. తాజాగా 2024 సంక్రాంతి కూడా అభిమానులకు నిజంగానే ఫెస్టివల్‌ కానుంది.

ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం జనవరి 12న విడుదల కానుంది. ఇక అదే రోజు తేజ సజ్జ, ప్రశాంత్ వర్మల హనుమాన్ కూడా రిలీజ్ కానుంది. వీటితో పాటు అక్కినేనా నాగార్జున..నా సామిరంగ, మాస్ మహారాజా రవితేజ ఈగిల్ కూడా సంక్రాంతి రేసులో రానుంది.

వీటితో పాటు విజయ్ దేవరకొండ – పరశురామ్ సినిమతో పాటు లేటెస్ట్ గా సంక్రాంతి రేస్ లో మరొ డబ్బింగ్ మూవీ నిలిచింది. శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ అయలాన్ కూడా సంక్రాంతికి రానుందని మేకర్స్ వెల్లడించారు. తొలుత ఈ ఏడాది దీపావళికి విడుదల చేయాలని భావించినా మూవీ విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కానీ కారణంగా సంక్రాంతికి వాయిదా పడింది. దీంతో మరో ఇద్దరు అగ్రహీరోలు సైతం సంక్రాంతి బరిలోకి వచ్చేందుకు ఉవ్విళ్లూరుతుండగా ఈసారి బాక్సాఫీస్‌ వార్ కన్నులపండగే కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -