చైనాలోని హాంగ్జౌ వేదికగా ఆసియా గేమ్స్ 2023 అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గత ఆసియా గేమ్స్‌లో 69 పతకాలు సాధించిన భారత్ ఈసారి సెంచరీ కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగగా తొలిరోజే బోణి కొట్టింది భారత్. ఈ రెండు పతకాలు రజతం కావడం విశేషం. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత్ షూటింగ్‌లో రజతం సాధించింది.
10 మీటర్ల మహిళల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన రమిత, మెహులీ, ఆషి కలిసి రజత పతకాన్ని గెలుచుకున్నారు. ముగ్గురూ కలిసి 1886 పాయింట్లు సాధించగా… అందులో రమిత 631.9 పాయింట్లు సాధించింది. మెహులీ 630.8 సాధించగా, ఆషి 623.3 పాయింట్లు సాధించింది.
ఇక రెండో పతకాన్ని రోయింగ్ లైట్ వెయిట్ డబుల్ స్కల్స్‌లో సాధించింది. పురుషుల లైట్ వెయిట్ విభాగంలో భారత్‌కు చెందిన అర్జున్ సింగ్, జాత్‌సింగ్‌లు 6:28:18తో సెకండ్ ప్లేస్ లో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు.భారత్ నుండి 650 మంది క్రీడాకారులు ఆసియా గేమ్స్‌లో పాల్గొన్నారు.
