Monday, May 20, 2024
- Advertisement -

సీఐడీ ప్రశ్నలతో చంద్రబాబుకు ఉక్కిరిబిక్కిరి!

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబును విచారిస్తున్నారు సీఐడీ అధికారులు. తొలిరోజు స్కాంకు సంబంధించిన పేపర్లు,ఆధారాలను బాబు ముందుంచి ప్రశ్నల వర్షం కురిపించగా రెండో రోజు 50 ప్రశ్నలను సిద్ధం చేశారు సీఐడీ అధికారులు. ఇక చంద్రబాబు చెబుతున్న ప్రతి సమాధానాన్ని వీడియో, టైపిస్ట్ ద్వారా రికార్డు చేస్తున్నారు. ఇక ఇవాళ్టితో చంద్రబాబు జ్యూడిషియల్ రిమాండ్, కస్టడీ ముగియనున్న నేపథ్యంలో ఆయన కస్టడీని పొడగించాలని సీఐడీ కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే నిన్న చంద్రబాబుని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు సీఐడీ అధికారులు. ప్రశ్నల్లో చంద్రబాబును సీమెన్స్ ఒప్పందం, స్కిల్ కేసులో ఆర్ధిక లావాదేవీల పైన ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం. డీ పి ఆర్ లేకుండా స్కిల్ ప్రాజెక్ట్ ఎందుకు ఓకే చేయించారు, సుమన్ బోస్ తో రహస్య ఒప్పందం ఏమైనా కుదిరిందా అని ఆరా తీశారు.

ఇక ఈ కేసులో గంటా సుబ్బారావుకు నాలుగు పదవులు కట్టబెట్టిన వ్యవహారం, ఆయనతో జరిపిన ఈ మెయిల్ సంభాషణల వ్యవహారం పైన కూడా ప్రధానంగా ప్రశ్నించారు. ఇక ఇవాళ విచారలనలో అధికారులు ఏం ప్రశ్నలు అడుగుతారు…వాటికి చంద్రబాబు ఇచ్చే సమాధానం ఏంటనే దానిపై ఉత్కంఠ నెలకొనే మంది. మరోవైపు ఈ వ్యవహారం నుండి బయటపడేందుకు బెయిల్ పిటిషన్లు వేస్తూనే ఉన్నారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. అయితే వారు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. బాబుకు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ అధికారులు 186 పేజీల వివరణ ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -