- Advertisement -

వెంకటేష్ రెండో కుమార్తె ఎంగేజ్‌మెంట్

- Advertisement -

దగ్గుబాటి వారింట్లో పెళ్లి బాజాలు మోగాయి. అయితే విశేషమెంటంటే అన్నదమ్ములు సురేష్‌ బాబు, వెంకటేష్ ఇద్దరి ఇంట్లో శుభకార్యాలు. సురేష్‌ బాబు కుమారుడు అభిరాం వివాహం డిసెంబ్‌లో శ్రీలకంలో జరగనుండగా తాజాగా వెంకటేష్ రెండో కుమార్తె ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

వెంకీ రెండో డాటర్ హవ్య వాహిని నిశ్చితార్ధం విజయవాడలో జరిగింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి ప్రైవసీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు వెంకటేష్. కేవలం సెలక్టెడ్ పీపుల్స్‌ని మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానించారు. మెగా స్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్, రానా, నాగ చైతన్య తదితరులు హాజరయ్యారు.

వాస్తవానికి కాంట్రవర్సీకి చాలా దూరంగా ఉంటారు వెంకటేష్. తన సినిమా కెరీర్ ని, వ్యక్తిగత కెరీర్ ని ఎప్పుడూ వేర్వేరుగానూ చూస్తారు. సినిమా సినిమానే వ్యక్తిగతం వ్యక్తిగతమే…మొదటి నుండి ఇదే ఫాలో అవుతూ వస్తున్నారు. అందుకే వెంకీకి ఫ్యామిలీ హీరో అనే పేరు కూడా వచ్చింది. వెంకీ హీరోగా నటించిన సైంధవ్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -