- Advertisement -

ఆ వర్గాలే టార్గెట్..వైసీపీ బస్సుయాత్ర స్పెషల్

- Advertisement -

ఏపీ రాజకీయాలకు ఇంకా సమయం ఉండగానే వాతావరణం మాత్రం రోజురోజుకు హీటెక్కిపోతోంది. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా జగన్ దూసుకుపోతుండగా వైసీపీ కళ్లెం వేసి అధికారాన్ని దక్కించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది టీడీపీ. వెరసీ ఇప్పుడు ఒకేసారి టీడీపీ, వైసీపీ యాత్రలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది.

ఇక నారా భువనేశ్వరని నిన్న న్యాయం గెలవాలి యాత్రను ప్రారంభించగా వైసీపీ బస్సుయాత్రను ఇవాళ ప్రారంభించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పైనే స్పెషల్ ఫోకస్ చేస్తూ సామాజిక సాధికార యాత్ర ద్వారా ఈ నాలుగున్నరేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించనుంది వైసీపీ. నేటి నుండి 60 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్రలు జరగనున్నాయి.

యాత్ర చేరుకునే నియోజకవర్గాల్లో తొలుత ఎంపిక చేసిన సచివాలయాన్ని వైసీపీ నేతలు సందర్శిస్తారు. ఇక్కడే ఎమ్మెల్యేలు, రీజినల్ కోఆర్డినేటర్లు,ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, స్థానికంగా ఎంపిక చేసిన 200 మందితో కలిసి సహాపంక్తి భోజనం చేస్తారు. ఇక ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో భారీతో బహిరంగ సభ నిర్వహిస్తారు.

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఏవిధంగా ప్రాధాన్యత ఇచ్చారో గుర్తుచేయనున్నారు. అలాగే ప్రభుత్వ పదవుల్లో జగన్ ఇచ్చిన ప్రాధాన్యతను వివరిస్తారు. మొదటి విడతలో 39 నియోజకవర్గాల్లో నవంబర్ 9 వ తేదీ వరకూ ఒక్కో రోజు మూడు ప్రాంతాల్లో జరగనుంది యాత్రలు సాగనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -