Friday, May 3, 2024
- Advertisement -

జై బాలయ్య..హ్యాట్రిక్ కొట్టాడు!

- Advertisement -

సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురులేదని నిరూపించారు బాలయ్య. దసరాకు భగవంత్ కేసరితో వచ్చిన బాలయ్య హిట్ కొట్టాడు. తొలి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లలో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా కూడా వందకోట్లు వసూళ్లు చేయడంతో హ్యాట్రిక్ ఫీట్ సాధించారు బాలయ్య.

రీసెంట్‌గా బాలయ్య నటించిన బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు’అఖండ’, ‘వీరసింహా రెడ్డి’ వందకోట్ల క్లబ్ లో చేరగా భగవంత్ కేసరితో హిట్ కొట్టి హ్యాట్రిక్ మొనగాడిగా నిలిచారు. ఆరు రోజుల్లో భగవంత్ కేసరి రూ. 51.80 కోట్ల రూపాయలు షేర్ సంపాదించింది. కొన్ని ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ ఎప్పుడో దాటిపోయింది.

ఇక బాలయ్య గత సినిమాలకు భిన్నంగా భగవంత్ కేసరిని తీర్చిదిద్దారు అనిల్ రావిపూడి. అభ్యంతరకర సన్నివేశాలు ఏమీ లేకపోవడం, ఫ్యామిలీతో సినిమా చూసే విధంగా తెరకెక్కించారు. కూతురు ఎమోషన్ తో పాటు ఆడపిల్లలు ఉన్న ఫ్యామిలీస్ ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. అందుకే హిట్‌గా నిలిచిందని చెప్పకతప్పదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -