టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై విడుదలైన తర్వాత జనసేన – టీడీపీ మధ్య సీట్ల పంపకాలపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. ఇక జనసేన సీట్లకు సంబంధించి ఇప్పటికే ఓ అంచనాకు రాగా ఇందులో ప్రధానమైంది తిరుపతి. తొలుత ఈ స్థానం నుండి పవన్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఎందుకంటే ఈ స్థానం నుండి గతంలో చిరంజీవి ప్రాతినిధ్యం వహించారు. అదే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని జనసైనికులు సూచించడంతో పవన్ పోటీకి దిగడం ఖాయమని భావించారు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం పవన్ తిరుపతి నుండి పోటీకి విముఖంగా లేరట.
ఇక ప్రస్తుతం జనసేన నుండి తిరుపతి స్ధానాన్ని ఆశీస్తున్న వారిలో కిరణ్ రాయల్‌తో పాటు పసుపులేటి హరిప్రసాద్ ఉన్నారు. ఇందులో కిరణ్ రాయల్ తిరుపతి ఇంఛార్జీగా ఉండగా హరిప్రసాద్ మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. ప్రముఖ డాక్టర్‌గా పేరుండటంతో వీరిద్దరి మధ్య పోటీ నెలకొంది. వీరిద్దరిలో ఒకరికి టికెట్ దక్కనుండగా జనసైనికులు మాత్రం తిరుపతిలో జెండా ఎగురవేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
మరోవైపు వైసీపీ నుండి ప్రస్తుత ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ బరిలో ఉండనున్నారు. భూమన టీడీడీ ఛైర్మన్‌గా ఉండగా ఆయన తనయుడికి టికెట్ కన్ఫామ్ చేశారు జగన్. దీంతో ఇప్పటివరకు పవన్ పోటీలో ఉంటారని భావించినా ఆయన తప్పుకోవడంతో తమ గెలుపు ఈజీ అవుతుందని భూమన అంచనా వేస్తున్నారు. ఇక జనసేన నుండి హరిప్రసాద్‌కు టికెట్ దక్కే అవకాశం ఉందని టాక్ నడుస్తున్న నేపథ్యంలో తిరుపతి రాజకీయాల గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది.