ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో 52 రోజుల రిమాండ్ తర్వాత మధ్యంతర బెయిల్ పై బయటికొచ్చిన సంగతి తెలిసిందే. ఆరోగ్య సమస్యలు, స్కిన్ అలర్జీతో పాటు ప్రధానంగా కంటి చికిత్స నేపథ్యంలో బాబుకు బెయిల్ మంజూరు కాగా ఇవాళ జూబ్లీహిల్స్ ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రిలో చంద్రబాబు కంటి చికిత్స విజయంతంగా జరిగింది.
చంద్రబాబుకు క్యాటరాక్ట్ ఆపరేషన్ విజయవంతంగా చేశారు డాక్టర్లు. ఆపరేషన్ అనంతరం వారితో కలిసి పోటోను దిగారు. ఆపరేషన్ తర్వాత చంద్రబాబు ఇంటికి వెళ్లగా ఆయన్ని చూసేందుకు భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఆస్పత్రి దగ్గరకు చేరుకున్నారు.
ఇక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో ఈ నెల 22 వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ఏపీ సీఐడీని ఆదేశించింది న్యాయస్థానం.ఇక స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీమెన్స్ ఇండియా కంపెనీ డైరెక్టర్ గంటి వెంకట సత్యభాస్కర్ ప్రసాద్ కు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు కాగా చంద్రబాబుకు మాత్రం నిరాశే ఎదురైంది. మధ్యంతర బెయిల్ పై ఉన్న చంద్రబాబు హైకోర్టు కండీషన్స్ని ధిక్కరిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. పొలిటికల్ సమావేశాల్లో పాల్గొనకూడదని న్యాయస్థానం స్పష్టం చేసినా బాబు వాటిని పట్టించుకోవట్లేదు. దీనిని ఇప్పటికే ఏపీ సీఐడీ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతానికి ఈ విషయంలో బాబుపై ఎలాంటి చర్యలు ఉంటాయో లేదో తెలియదు కానీ భవిష్యత్లో బెయిల్పై మాత్రం ఇది కచ్చితంగా ఎఫెక్ట్ చూపించడం ఖాయమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
