Saturday, May 18, 2024
- Advertisement -

నేనే సీఎం…కోమటిరెడ్డి సంచలనం!

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌లో అప్పుడే వార్ షురూ అయింది. ఇప్పటికే రేవంత్ వర్గం ఆయనే సీఎం అని ప్రచారం చేస్తుండగా తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వయంగా తానే సీఎం అని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. నల్గొండలో నామినేషన్ అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడిన కోమటిరెడ్డి…భవిష్యత్‌లో తాను సీఎం అవడం గ్యారెంటీ అని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

కోమటిరెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారాయి. వాస్తవానికి కాంగ్రెస్‌లో సీనియర్ నేతలంతా సీఎం రేసులోనే ఉన్నారు, ఉంటారు కూడా. ఇది అందరికి తెలిసిన సత్యమే. ఒక్క నల్గొండ జిల్లా నుండే కోమటిరెడ్డితో పాటు ఉత్తమ్, జానా లాంటి వారు సైతం సీఎం పదవిని ఆశీస్తున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించిని నేపథ్యంలో రేవంత్ వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇక మూడో లిస్ట్ తర్వాత కాంగ్రెస్‌లో అసంతృప్తి తారాస్ధాయికి చేరింది. మాజీ మంత్రి చెన్నారెడ్డికి వనపర్తి టికెట్ రాకపోవడంతో ఆయన అభిమానులు గాంధీ భవన్‌కు తాళం వేశారు. పటాన్ చెరులో టికెట్ ఆశించి భంగపడ్డ కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. రేవంత్ ఇంటి వద్ద శ్రీనివాస్ గౌడ్ అనుచరులు ఆందోళనకు దిగగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా సైతం కాంగ్రెస్‌ను వీడనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంకా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తే మరింత కుంపటి రాజుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -