Sunday, May 12, 2024
- Advertisement -

షర్మిల తప్పుచేసిందా?

- Advertisement -

తెలంగాణ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల పోటికి దూరమై కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షర్మిల తీరుపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా తాజాగా నేతలంతా మూకుమ్మడి రాజీనామాలు చేశారు. పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రారావు,సత్యవతి,గణేష్ నాయక్,బీ సంజీవరావు తదితరులు రాజీనామాలు ప్రకటించారు.

అనంతరం మాట్లాడిన గట్టు రామచంద్రావు…షర్మిల తీరును తప్పుబట్టారు. వైఎస్ పేరును షర్మిల చెడగొట్టారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ లో నిలబడతా అని చివరగా అందరిని రోడ్డు మీద నిలబెట్టిందని…ఇన్ని రోజులు షర్మిలకు మద్దతిచ్చినందుకు క్షమాపణ చెబుతున్నామన్నారు. తెలంగాణ ప్రజలంటే షర్మిలకు చిన్నచూపని ఆమె అసలు రాజకీయాలకు పనికిరాదన్నారు. వైఎస్‌పై అభిమానంతో అంతా పార్టీలో చేరితే అందరిని నట్టేట ముంచిందన్నారు. ఇక షర్మిల కాంగ్రెస్‌కు మద్దతివ్వడం ఆమె చేసిన పెద్ద తప్పు అన్నారు.

ఈ సందర్భంగా ఆంధ్ర షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన షర్మిల వెంటనే తెలంగాణను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఇక షర్మిల కాంగ్రెస్‌కు మద్దతిస్తామని ప్రకటించినా ఆ పార్టీ నేతల నుండి ఎలాంటి స్పందన రావడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -