- Advertisement -

‘అదుర్స్’ రీ రిలీజ్.. ట్రైలర్ అదుర్స్!

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ఒకటి అదుర్స్. మాస్ చిత్రానికి భిన్నంగా వివి వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.2010లో విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయగా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఎన్టీఆర్ సరసన నయనతార, షీలా ప్రధానపాత్రల్లో నటించగా వల్లభనేని వంశీమోహన్ నిర్మాత. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం 155 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. మలయాళంలో కవచం అనే పేరుతో రిలీజ్ చేయగా అక్కడ మంచి హిట్ కొట్టింది.

ఇక ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. రీసెంట్‌గా సింహాద్రి రీ రిలీజ్‌కు మంచి స్పందన రాగా తాజాగా అదుర్స్ సైతం రీ రిలీజ్ కానుంది.నవంబర్ 18, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో 4కే వెర్షన్ లో రీ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్ ను చేయగా మంచి స్పందన వస్తోంది.

బాక్సాఫీస్ ముందు జోరు కనబర్చిన ఈ చిత్రం రీ రిలీజ్‌లో సత్తా చాటుతుందా లేదా వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -