Friday, May 10, 2024
- Advertisement -

టీమిండియా..సెమీస్ గండాన్ని అధిగమిస్తారా?

- Advertisement -

భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. రోహిత్ సేన ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక టైటిల్ ఫేవరేట్‌గా భారత్ ఉన్నా..సెమీస్ గండాన్ని అధిగమిస్తారా అన్నది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న.

ఎందుకంటే గత ప్రపంచకప్‌ సెమీస్‌లను పరిశీలిస్తే భారత్ ఓడిపోయిందే ఎక్కువ.1987,1996, 2015, 2019 సంవత్సరాలలో సెమీస్ లో ఓటమి పాలైంది భౄరత్. ఇక ఈసారి సెమీఫైనల్ జరుగుతున్న వాంఖండే స్టేడియంలో టీమిండియా రికార్డు అంత బాలేదు. 2016 టి 20 వరల్డ్ కప్ సెమీస్ లోనూ, అలాగే 1987 లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సెమీస్ లోనూ ఇదే స్టేడియంలో ఓటమిని మూటగట్టుకుంది.అందుకే భారత్ ఇప్పటివరకు అద్భుత ప్రదర్శన కనబర్చినా సెమీస్ అనే సరికి కలవరానికి లోనవుతున్నారు ఫ్యాన్స్.

ఈ నెల 15 న జరిగే సెమీస్ ఫైట్ లో కివీస్‌తో తలపడనుంది భారత్. ఇక ఇదే న్యూజిలాండ్‌తో 2019 వరల్డ్ కప్ లో సెమీస్ లో ఓటమి పాలైంది.అందుకే ఈ సారి కివీస్‌పై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతున్న ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మాత్రం అందరిలో నెలకొంది. మరి ఈ సెమీస్ గండాన్ని అధిగమించి భారత్ ఫైనల్లోకి అడుగుపెడతారా లేదా అన్నది వేచిచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -