- Advertisement -

మళ్లీ బీజేపీలోకి గాలి జనార్థన్ రెడ్డి!

- Advertisement -

మైనింగ్…ఈ పేరు వింటే గుర్తుకొచ్చే పేరు గాలి జనార్థన్ రెడ్డి. మైనింగ్ కింగ్‌గా పేరు సంపాదించిన గాలి ఒకానొక దశలో ఓ వెలుగు వెలిగారు. కానీ తర్వాత గాలి మైనింగ్ బాగోతం బయటకు రావడంతో కటకటాల పాలు కా తప్పలేదు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీని వీడి సొంతగా పార్టీని స్థాపించారు.గత ఎన్నికల్లో కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష పేరుతో పార్టీని స్థాపించి పోటీ చేయగా ఆయన పార్టీ తరపున పోటీచేసిన వారందరూ ఓటమి పాలుకాగా గాలి జనార్థన్ రెడ్డి ఒక్కరే గంగావతి నియోజకవర్గం నుండి విజయం సాధించారు.

ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మాజీ సీఎం యెడియూరప్ప తనయుడు విజయేంద్ర ఉన్నారు. దీంతో తిరిగి బీజేపీలో చేరాలని జనార్థన్ రెడ్డి నిర్ణయించుకున్నారని సమాచారం. లోక్ సభ ఎన్నికల వేళ గాలిని పార్టీలోకి తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని బీజేపీ సైతం భావిస్తున్నట్లు తెలుస్తోది.

ఇక త్వరలోనే గాలి బీజేపీలో చేరడంపై క్లారిటీ రానుంది. గాలి రీ ఎంట్రీపై విజయేంద్ర క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది.ఇక గతంలోనూ యెడియూరప్పపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దీంతో ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న విజయేంద్ర గాలి రాకను వ్యతిరేకించడం లేదు. దీంతో ఆయన పార్టీలో చేరడంపై లైన్ క్లీయర్ అయినట్లు తెలుస్తోంది. ఇక 2008లో కర్ణాటకలో తొలి సారి బీజేపీ సర్కార్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు జనార్థన్ రెడ్డి. తర్వాత అక్రమ మైనింగ్ ఆరోపణలు రావడంతో బీజేపీకి దూరమయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -