- Advertisement -

తమిళ దర్శకులపై ఆమని సంచలన ఆరోపణలు!

- Advertisement -

ఒకప్పుడు క్యాస్టింగ్ కౌచ్….ఇప్పుడు హీరోయిన్లుపై తోటి నటుల సూటిపోటి మాటలు. వెరసీ హీరోయిన్ల ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఇక ప్రస్తుతం త్రిష వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. త్రిషకు మద్దతుగా టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు నిలవగా మన్సూర్ అలీఖాన్ మాత్రం ఎంతకి తగ్గేదేలే అని సారీ చెప్పేది లేదంటూ తేల్చి చెప్పారు.

ఇక ఈ వివాదం కొనసాగుతుండగానే నటి ఆమని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ ఇండస్ట్రీలో తాను క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నాని తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమని.. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కొందరు తమిళ డైరెక్టర్లు ఒంటరిగా రమ్మని పిలిచేవారని ఆవేదన వ్యక్తం చేశాఉ. ఒకవేళ వెళ్లకపోతే తమ సినిమాల్లో అవకాశం ఇచ్చేవారు కాదని తెలిపారు.

కొత్త దర్శకులు ఇలా చేశారు అనుకుంటే పొరపాటే…పెద్ద పెద్ద పేరున్న దర్శకులే ఇలా చేసేవారని బాధపడ్డారు ఆమని. హీరోయిన్స్ అంటే వారికి ఓ ఆటబొమ్మ. కానీ, వారికి ఫ్యామిలీస్ ఉంటాయని, వారికి కూడా బాధలు ఉంటాయని అర్ధం చేసుకోవాలన్నారు. ఆ రోజుల్లో మేం ఎన్నో ఇబ్బందులు పడ్డాం అని ఆమని సంచనల కామెంట్స్ చేసింది. మేము హీరోయిన్స్‌గా చేసే సమయంలో విలన్ చేత ఓ రేప్ సీన్ ను ఖచ్చితంగా సినిమాల్లో పెట్టేవారన్నారు. ఆ సీన్ లో విలన్లు హీరోయిన్ల పై పడి నలిపేసే వాళ్ళు అని చెప్పుకొచ్చింది. మరి దీనిపై కోలీవుడ్ ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -