పవన్‌పై బాలీవుడ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. మొఘల్ కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌తో 17వ శతాబ్దానికి చెందిన కథతో వస్తుండగా పాన్ ఇండియా మూవీగా పవన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కుతోంది. పవన్ సరసన నిధి అగర్వాల్,నర్గీస్ ఫక్రీ హీరోయిన్లుగా నటిస్తుండగా ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.

టీజర్‌తోనే హరిహర వీరమల్లుపై అంచనాలు పెరిగిపోగా తాజాగా సినిమాకు సంబంధించి బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ సంచలన కామెంట్స్ చేశారు. యానిమల్‌లో తన అద్భుత నటనతో ప్రేక్షకుల మెప్పించిన బాబీ డియోల్..పవన్ ఒక పెద్ద సూపర్ స్టార్ అని కొనియాడారు. హరిహర వీరమల్లు సినిమాపై తాను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నానని… మేకర్స్ చాలా గ్రాండ్ గా సినిమాని నిర్మిస్తున్నారని తెలిపారు. సినిమా అందరిని ఆకట్టుకుంటుందని చెప్పారు.

ఈ సినిమాత పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్‌సింగ్ చేస్తున్నారు. . మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.