- Advertisement -

కమ్యూనిస్టు నేత బయోపిక్‌లో సముద్రఖని!

- Advertisement -

సముద్రఖని..దర్శకుడిగా, రచయితగా, నటుడిగా విలక్షణ ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేయడం సముద్రఖని సొంతం. తండ్రిగా అయినా, విలన్‌గా అయినా ఆ పాత్రలో సెట్ అయిపోతారు. ఇక రీసెంట్‌గా విమానం సినిమాలో కొడుకు కోరిక తీర్చే తండ్రి పాత్రలో మెప్పించారు.

ప్రస్తుతం సముద్రఖని చేతిలో ఎన్నో ఆఫర్లు ఉండగా ఇందులో టాలీవుడ్‌ సినిమాలే ఎక్కువ.ఇక తాజాగా మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ సముద్రఖని. ఈసారి ఓ రాజకీయ నాయకుడి బయోపిక్‌లో నటించనున్నారు. తెలంగాణ రాజకీయాల్లో నిరాడంబరుడిగా, నిస్వార్ధ కమ్యూనిస్టుగా పేరు తెచ్చుకున్న గుమ్మడి నర్సయ్య బయోపిక్‌లో నటించనున్నారట. కథ వినగానే సినిమాకు సముద్రఖని ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అఫిషియల్ అనౌన్స్‌ మెంట్ రావాల్సి ఉంది.

దీంతో పాటు మరో సెంటిమెంట్ నేపథ్యంలో సాగే కథకు ఓకే చెప్పారు సముద్రఖని. ధన్ రాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -