Sunday, April 28, 2024
- Advertisement -

కాజల్ మళ్లీ లైన్‌లోకి వచ్చేసింది!

- Advertisement -

కాజల్ అగర్వాల్..టాలీవుడ్ అగ్రహీరోయిన్‌. 17 ఏళ్ళుగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ రీసెంట్‌గా బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ క్రమంలో బొద్దుగా మారిపోయింది కాజల్.ఈ క్రమంలో బరువు తగ్గేందుకు జిమ్‌తో పాటు వర్కవుట్స్ చేస్తోంది కాజల్.

అయితే కాజల్ పని ఇక అయిపోయింది అనుకున్నారు అంతా. కానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస అవకాశాలతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేసింది. భగవంత్ కేసరిలో బాలయ్యతో మెప్పించిన ఈ బ్యూటీ తర్వాత ఇండియన్ 2గా ప్రేక్షకుల ముందుకురానుంది. పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్న ఈ సినిమా కాజల్‌కి ఖచ్చితంగా బ్రేక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

దీంతో పాటు తమిళ స్టార్ హీరో అజిత్‌తో సినిమా ఛాన్స్ కొట్టేసింది.అలాగే దళపతి విజయ్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రస్తుతం కాజల్ వయస్సు 38 కాగా సినిమా అవకాశాలు కష్టం అనుకుంటున్న తరుణంలో ఇలా వరుస ఛాన్స్‌లు కొట్టేస్తూ అదరహో అనిపిస్తోంది ఈ ముదరు భామ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -