- Advertisement -

ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా ‘వైనాట్’?

- Advertisement -

ఏపీలో ఎన్నికల జోష్ నెలకొంది. ఎలక్షన్స్‌కు ఇంకా సమయం ఉండగానే అన్ని పార్టీలన్ని ఇప్పటి నుండి వ్యూహా, ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే వైసీపీ వైనాట్ 175,ఏపీ నీడ్స్ జగన్‌ వంటి నినాదాలతో ముందుకు సాగుతుండగా కాంగ్రెస్ నేతలు సైతం వైనాట్ ఆంధ్రప్రదేశ్‌ నినాదంతో ప్రజల్లోకి రానుంది.

ఇలా వైనాట్ అనే స్లోగన్ ఇప్పుడు ఏపీ ప్రజల నోట్లో నానుతోంది. ప్రధాన పార్టీల నాయకులంతా ఇదే స్లోగన్‌ని ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతలు సైతం వైనాట్ నినాదాన్ని ఎంచుకుంటుండటం, పోస్టర్‌లు, ప్రధాన కూడళ్లలో ఇవే నినాదాలు దర్శనమిస్తున్నాయి.

దీంతో ఈ వైనాట్ అనే స్లోగన్ ఎవరికి లాభం చేకూరుస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక దక్షిణాదిన రెండు రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి రావడంతో ఏపీపై దృష్టిసారించారు కాంగ్రెస్ నేతలు. త్వరలోనే కాంగ్రెస్ అగ్రనేతలు ఏపీలో పర్యటించి పార్టీకి పూర్వవైభవం తెచ్చేలా గ్రౌండ్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అయితే ప్రధానంగా పోరు మాత్రం వైసీపీ, టీడీపీ మధ్యే ఉండే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -