Sunday, May 19, 2024
- Advertisement -

జనసేనలో చంద్రబాబు కోవర్టు!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఒంటికాలుపై లేస్తారు వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఏ చిన్న అవకాశం చిక్కిన పవన్‌ను టార్గెట్ చేయడంలో ముందుంటారు వర్మ. తాజాగా జనసేనలో చంద్రబాబు కోవర్టు ఉన్నారని సంచలన కామెంట్స్ చేశారు. ఇక ఇంతకీ ఆ కోవర్టు ఎవరనుకుంటున్నారా..?ఆయన పవన్ కళ్యాణ్‌ అని ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఆర్జీవీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం వ్యూహం. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో పవన్‌ని టార్గెట్‌ చేస్తూ ట్వీట్ చేశారు ఆర్జీవీ. జనసేన పార్టీలో చంద్రబాబు కోవర్టు పవన్ కళ్యాణే అని నాకు అనిపిస్తుందని చెప్పుకొచ్చారు.

బ్యాగ్ గాయ్స్‌కు బ్యాడ్ న్యూస్ అంటూ చెప్పిన ఆర్జీవీ..డిసెంబర్ 29వ తేదీన థియేటర్స్‌లో కలుద్దాం అని చెప్పారు. ఇక జనవరి 25వ తేదీన వ్యూహం సినిమాకు సీక్వెల్ శపథం వస్తుందని వెల్లడించారు. అలాగే వ్యూహం సినిమాకు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. సోఫాలో చంద్రబాబు వేషధారి కూర్చుని ఉంటే పవన్ కళ్యాణ్ పాత్రధారి నిలబడి సాలోచనగా నడుస్తూ ఉన్నారు. మీరేమనుకుంటున్నారు.. వారు మాట్లాడుతున్నారని అనుకుంటున్నారా? అంటూ రాసి ఉండగా ఆ ఫొటోలో మాత్రం అంత సీన్ లేదు అని రాసి ఉంది. ఇప్పుడు ఆర్జీవీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -