Sunday, May 19, 2024
- Advertisement -

చేతిలో మజ్లిస్..సీఎం రేవంత్ పక్కా స్కెచ్!

- Advertisement -

కారు – మజ్లిస్ రెండు ఒకటే. తెలంగాణ వచ్చాక దాదాపు పది సంవత్సరాల పాటు వీరి స్నేహం కొనసాగింది.ఇటు మజ్లిస్ చీఫ్, అటు బీఆర్ఎస్ చీఫ్ ఇద్దరు ఒకరిపై ఒకరు ప్రశంసలు గుప్పించుకోవడమే కాదు రీసెంట్‌గా జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ముస్లిం సామాజిక వర్గం ఓటేయాలని పిలుపునిచ్చారు ఓవైసీ. అయితే కేసీఆర్‌కు పరాభవం తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా మ్యాజిక్ ఫిగర్ కంటే 4 స్థానాలు మాత్రమే ఎక్కువగా వచ్చాయి.

దీంతో ఇప్పటివరకు కారు పార్టీతో ఉన్న మజ్లిస్‌ను తన వైపుకు తిప్పుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా మజ్లిస్‌తో రేవంత్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రొటెం స్పీకర్‌గా అక్బర్‌ని ఒప్పించడం దగ్గరి నుండి పాతబస్తీ డెవలప్‌మెంట్ వరకు రేవంత్ తన మార్క్ స్పష్టంగా చూపిస్తున్నారు.

అభివృద్ధి అజెండాలో మజ్లిస్‌కు స్నేహాస్తం చాటుతున్న రేవంత్ ప్రయత్నాలు ఫలిస్తున్నట్లుగానే తెలుస్తోంది. మూసీకారిడార్‌తో పాతబస్తీకి దగ్గరయ్యేందుకు , అలాగే ఐపీఎస్ షానవాజ్‌కాసీంను సీఎంవోలోకి తీసుకోవడంతో మైనార్టీలకు పెద్దపీట వేశామన్నసంకేతాన్ని పంపించారు. ఇక పాతబస్తీ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు మజ్లిస్ సిద్ధమైనట్లు సమాచారం. వాస్తవానికి మజ్లిస్‌పై ఓ అపవాదు ఉంది. ప్రభుత్వం అంటే అధికారంలో ఎవరు ఉంటే వారికి మద్దతివ్వడం ఓవైసీ బ్రదర్స్‌కు అలవాటే. అందుకే కాంగ్రెస్‌ కు త్వరలోనే మజ్లిస్ జై కొట్టనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -