పవన్ ఆశలపై నీళ్లు చల్లిన లోకేష్!

టీడీపీ – జనసేన పొత్తులో సీట్ల సంఖ్య,అభ్యర్థుల ఎంపిక ఖరారు కాకముందే సీఎం ఎవరనే దానిపై ఎవరి ఆశలు వారికున్నాయి. ఇక ప్రధానంగా సీఎం సీటు తనదేనన్న ఊహాల్లో ఉన్నారు పవన్. అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. అయితే పవన్ ఆశలకు ఆదిలోనే కల్లెం వేశారు నారా లోకేష్.

జర్నలిస్ట్ జాఫర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీఎం పదవి షేరింగ్ ఉండబోదని, చంద్రబాబే సీఎం అవుతారని చెప్పారు లోకేష్‌.జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ.. సీఎం పదవి టీడీపీదేనని ఇందులో మరో ఆలోచన లేదన్నారు. తానెప్పుడూ పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా మాట్లాడలేదని… వ్యక్తిగతంగా తమ మధ్య విబేధాలు లేవన్నారు.

దీంతో ఇప్పటివరకు సీఎం అవుతానని భావించిన పవన్ అండ్ టీంకు షాకిచ్చినట్లైంది. ఎందుకంటే సీఎం పదవి ఇవ్వనప్పుడు జనసేనకు ఇచ్చే సీట్ల సంఖ్య తగ్గడం ఖాయం. ఎందుకంటే ఎక్కువ సీట్లు ఇస్తే జనసేన నిర్ణయాత్మకంగా మారితే అది టీడీపీ నష్టం అవుతుంది. అందుకే టీడీపీ నేతలు పవన్‌కు ముందు నుండే క్లారిటీ ఇస్తూ, జనసేన పోటీ చేసే స్థానాలపై హింట్ ఇస్తూ వస్తున్నారు. వాస్తవానికి సీఎం పదవిపై గతంలో పవన్ ఎన్నోసార్లు వ్యాఖ్యానించారు. ఒక ఛాన్స్ ఇవ్వాలంటూ అభ్యర్థించారు. కానీ చంద్రబాబు మాయలో పడిన పవన్…పూర్తిగా టీడీపీ కార్యకర్తలాగ మారిపోయారనే విమర్శలను మూటగట్టుకున్నారు.