టీడీపీ అధినేత చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఇన్ని ఫీట్లు ఎప్పుడు వేసి ఉండరు. జైలు జీవితం, దేవాలయాల సందర్శన ఇప్పుడు యాగాల నిర్వహణ. ఉండవల్లిలోని తన నివాసంలో మూడు రోజుల పాటు యాగాలు చేయనున్నారు చంద్రబాబు.
శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి చండీయాగం, సుదర్శన నారసింహ హోమంతో పాటు మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ఈ యాగంలో పాల్గొననున్నారు. అయితే చంద్రబాబు గతంలో కేసీఆర్ నిర్వహించిన యాగాల్లో పాల్గొన్నారు. కానీ ఆయనే స్వయంగా ఇప్పుడు యాగం చేస్తుండటం విశేషం.
అయితే యాగాలు, దేవాలయాల సందర్శన పేరుతో చంద్రబాబు చేస్తున్న ఈ ఫీట్లు ఎంత వరకు ఫలిస్తాయి అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరు. అన్నిపార్టీలతో కలిసి వచ్చిన జగన్‌ను ఎదుర్కొలేని సిచ్యువేషన్. ఇక టీడీపీ – జనసేన కంటే ఎన్నికల వ్యూహంలో ముందున్నారు జగన్. ఆయన ఎప్పుడు ఎలాంటి ఎత్తులు వేస్తారో 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు అస్సలు ఉహించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.
