Wednesday, May 1, 2024
- Advertisement -

కడపకు సీఎం జగన్..షెడ్యూల్ ఇదే!

- Advertisement -

ఎన్నికల వేళ దూకుడు పెంచారు సీఎం జగన్. ఓ వైపు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తూనే మరోవైపు జిల్లాల్లో పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇక తాజాగా సీఎం జగన్ తన సొంత జిల్లా కడప టూర్ ఖరారైంది.

రేపటి నుండ మూడు రోజుల పాటు కడపలో పర్యటించనున్నారు జగన్. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడంతో పాటు పలు డెవలపమెంట్ వర్క్స్‌ని ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నుండి కడప చేరుకుంటారు. అక్కడి నుండి గోపవరం చేరుకుని సెంచురీ ప్లై పరిశ్రమలోని ఎండీఎఫ్, హెచ్‎పీఎల్ ప్లాంటులను ప్రారంభించనున్నారు.

తర్వాత రిమ్స్ ఆసుపత్రికి చేరుకొని డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ వైఎస్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ యూనిట్, డాక్టర్ వైఎస్ఆర్ క్యాన్సర్ కేర్ బ్లాక్, ఎల్‎వీ ప్రసాద్ కంటి ఆసుపత్రితోపాటు, వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లను ప్రారంభిస్తారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని, సుందరంగా తీర్చిదిద్దిన అంబేద్కర్ సర్కిల్, వై జంక్షన్, కోటిరెడ్డి సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్స్ కు ప్రారంభోత్సవం చేస్తారు.

24 న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్దకు చేరుకని నివాళి అర్పిస్తారు. అలాగే పులివెందుల ఎంపీటీసీలతో సమావేశం కానున్నారు వైసీపీ అధినేత. ఇక సీఎం జగన్ కడప జిల్లా పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -