సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇక ఇప్పటికే రిలీజైన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకి మంచి స్పందన వచ్చింది. తాజాగా క్రిస్మస్ కానుకగా మేకర్స్ గుంటూరు కారం నుండి మరొక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను విడుదల చేశారు.
ఇప్పటివరకు మహేష్ బాబు మాస్ లుక్‌ని రివీల్ చేయగా తాజాగా అందంగా, సూపర్ కూల్‌గా కనిపిస్తున్న మహేష్ లుక్ అందరిని ఆకట్టుకుంటోంది. మహేష్ సరసన శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తుండగా ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుందని తెలుస్తోండగా హారిక & హాసిని క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇక త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్ర ఇది.
