Monday, April 29, 2024
- Advertisement -

ఏపీపై రాహుల్ స్పెషల్ ఫోకస్!

- Advertisement -

దక్షిణాదిన రెండు రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణలో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ అదే జోష్‌తో త్వరలో ఏపీలో జరగబోయే ఎన్నికల్లో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా టార్గెట్ ఏపీగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జీగా గతంలో తెలంగాణ ఇంఛార్జీగా పనిచేసిన మాణికం ఠాగూర్‌ని నియమించగా ఇక ఈ నెల 27న పార్టీ నేతలతో సమావేశం కానున్నారు రాహుల్ గాంధీ.

ఈ సమావేశానికి ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, మాణిక్యం ఠాగూర్, సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరా రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, చింతా మోహన్, కొప్పుల రాజు, జేడీ శీలం తదితర నేతలు హాజరుకానున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

దీంతో పాటు ప్రధానంగా ఎన్నికల్లో పొత్తుల అంశం ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత తెలంగాణ సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కాంగ్రెస్ ప్రాబల్యం లేకుండా పోయింది. సీనియర్ నేతలమని పేరు చెప్పుకునే వారంతా మొహం చాటేశారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత రెండుసార్లు ఎన్నికలు జరుగగా కనీస ఓట్లు కూడా సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో కేవలం దక్షిణాదిన రెండు రాష్ట్రాలు అధికారంలోకి రావడంతో ఆ గాలితోనైనా కనీసం సత్తాచాటాలని భావిస్తున్నారు హస్తం నేతలు. మరి హస్తం నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీ పూర్వ వైభవం తేవడానికి దోహద పడుతుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -