Saturday, April 27, 2024
- Advertisement -

సలార్..రికార్డులు బ్రేక్

- Advertisement -

కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం సలార్. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ పార్టు డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురాగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. రిలీజైన అన్ని భాషల్లోనే కాదు, ఓవర్సీస్‌లోనూ సత్తాచాటుతోంది సలార్.

ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో రూ.185.67 కోట్ల షేర్, రూ.330 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. వరల్డ్ వైడ్ గా రూ. 345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 347 కోట్లు . మరో రూ. 161.33 కోట్లు రాబడితే బ్రేక్ ఈవెన్ అవుతుంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టింది సలార్. ఒక్క సీడెడ్‌లోనే దాదాపు రూ.12 కోట్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇవాళ హాలీడే కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా పృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -