సంజీవ్ మేగోటి దర్శకత్వంలో శివ కంఠమనేని హీరోగా తెరకెక్కిన చిత్రం రాఘవ రెడ్డి . రాశి, నందితా శ్వేత, అన్నపూర్ణ, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి, అజయ్, పోసాని ప్రధాన పాత్రల్లో నటించగా కేఎస్ శంకర్ రావ్, ఆర్ వెంకటేశ్వర్ రావు, జి రాంబాబు యాదవ్ నిర్మించారు. జనవరి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది.
కథ:
వైజాగ్ లోని ఓ కాలేజీలో క్రిమినాలజీ ప్రొఫెసర్ రాఘవ రెడ్డి(శివ కంఠమనేని). కుటుంబం ఎవరు లేకపోవడంతో కాలేజీనే తన కుటుంబంగా, అక్కడ ఉన్న స్టూడెంట్స్ ని తన పిల్లలగా భావించి అందరిని క్రమశిక్షణలో పెడుతూ ఉంటాడు. హైదరాబాద్ నుండి వచ్చిన మహాలక్ష్మి(నందితా శ్వేతా)ఇదే కాలేజీలో జాయిన్ అవుతుంది. చిన్నప్పటి నుండి గారాబంగా పెరిగిన మహాలక్ష్మీ కాలేజీలో అల్లరి చేస్తూ మొత్తం క్రమశిక్షణ చెడగొట్టేలా చేస్తుంది. దీంతో ఆమెను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాడు రాఘవ రెడ్డి. ఇద్దరి మధ్య గొడవ జరుగగా ఈ క్రమంలో మహాలక్ష్మీ కిడ్నాప్ అవుతుంది. దీంతో రాఘవరెడ్డి ఏం చేశాడు..? మహాలక్ష్మి, జానకి, రాఘవ రెడ్డికి ఉన్న లింక్ ఏంటి..? చివరకు కథ ఎలా సుఖాంతం అయిందనేదే సినిమా స్టోరీ.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ హీరో శివ కంఠమనేని నటన, కథలో కొత్తదనం,సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్. ముఖ్యంగా తనదైన నటనతో అదరగొట్టాడు శివ. ఎక్కడా కొత్త హీరో అని కనినించకుండా నటించాడు. డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్‌లో సూపర్బ్ అనిపించాడు. తెరపై శివ సూపర్బ్ అనిపించే పర్ఫామెన్స్ ఇచ్చారు. లక్కీ పాత్రకు న్యాయం చేసింది నందితా శ్వేతా. రాశి సినిమాకు మరింత ప్లస్‌గా మారింది. ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుత నటన కనబర్చింది.మిగితా నటీనటుల్లో పోసాని,అజయ్, ప్రవీణ్, అజయ్ ఘోష్, శ్రీనివాసరెడ్డి, బిత్తిరి సత్తి తమ పాత్రలకు వంద శాతం న్యాయం చేశారు.
టెక్నికల్ విభాగం:
సాంకేతికంగా సినిమా బాగుంది. తాను అనుకున్న స్టోరిని తెరకెక్కించడంలో దర్శకుడు చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే రెగ్యులర్ యూత్ లవ్ స్టోరిని పక్కనపెట్టి డిఫరెంట్‌గా ట్రై చేశారు. సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ బాగుంది. సినిమా నిడివి రెండు గంటలు మాత్రమే కావడంతో ఎక్కడా బోరింగ్ అనిపించదు. కెఎస్ శంకర్ రావ్, జి రాంబాబు యాదవ్, ఆర్ వెంకటేశ్వర్ రావు నిర్మాణ విలువలకు వంక పెట్టలేం.
రెగ్యులర్ కథలకు భిన్నంగా దర్శకుడు సంజీవ్ మేగొటి చేసిన ప్రయత్నమే రాఘవరెడ్డి. తన కూతురు కోసం ఓ తండ్రి పడే ఆవేదనను, ఫ్యామిలీ సెంటిమెంట్స్ ని ఎమోషనల్ గా చూపించి మెప్పించారు. కథలో దమ్ముంటే చిన్న సినిమా కూడా నిలబడుతుంది అన్నదానికి నిదర్శనం రాఘవరెడ్డి.
విడుదల తేదీ:06/01/2024
రేటింగ్:2.5/5
నటీనటులు:శివ కంఠంనేని, రాశి, నందిత శ్వేత
సంగీతం:సంజీవ్ మేగోటి – సుధాకర్ మారియో
నిర్మాత: శంకర్ రావ్, రాంబాబు యాదవ్, వెంకటేశ్వర్ రావు,
దర్శకత్వం:సంజీవ్ మేగోటి
