Sunday, May 19, 2024
- Advertisement -

సీఎం రేవంత్‌తో షర్మిల భేటీ

- Advertisement -

ఇటీవలె కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయగా త్వరలోనే ఆమెకు కీలక బాధ్యతలు అప్పజెప్పనున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇక కాంగ్రెస్‌లో చేరిన అనంతరం తొలిసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు షర్మిల. సీఎం రేవంత్‌ని కలిసిన షర్మిల తన కుమారుడి నిశ్చితార్థం, వివాహ వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. కుటుంబ సమేతంగా వివాహా కార్యక్రమానికి రావాలని రేవంత్‌ని ఆహ్వానించారు షర్మిల. దీనికి రేవంత్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు పార్టీని స్థాపించారు షర్మిల. వైఎస్‌ఆర్‌టీపీ పేరుతో తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నించారు. పాదయాత్ర, దీక్షలు చేశారు. అంతేగాదు పాలేరు నుండి పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ కూడా చేశారు. ఇక షర్మిల పాలేరు నుండి పోటీ చేయడం దాదాపు ఖాయం కాగా చివరి నిమిషంలో ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించి షాకిచ్చారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఢిల్లీలో కాంగ్రెస్‌లో చేరగా ఆమెకు ఏపీసీసీ చీఫ్‌ బాధ్యతలు అప్పజెబుతారనే ప్రచారం జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -