Saturday, May 10, 2025
- Advertisement -

రాజ్యసభ రేసు నుండి టీడీపీ ఔట్?

- Advertisement -

ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 27న ఎన్నిక జరగనుండగా వైసీపీ మూడు గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ తరపున ముగ్గురు అభ్యర్థులను జగన్ ఖరారు చేయగా క్రాస్ ఓటింగ్‌పై ఆశలు పెట్టుకుని బరిలోకి దిగాలని భావించారు టీడీపీ చీఫ్ చంద్రబాబు.

అయితే రాజ్యసభ స్థానాన్ని దక్కించుకోడానికి తగినంత మంది ఎమ్మెల్యేలు లేకపోవడం, అభ్యర్ధిని నిలిపినా గెలుపు భరోసా లేకపోవడంతో పోటీ నుండి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక రాజ్యసభకు పోటీ చేయాలా వద్దా అన్న దానిపై చంద్రబాబు మౌనం వీడక పోవడంతో పోటీ నుండి తప్పుకున్నట్లేననే వార్తలు వస్తున్నాయి.

ఇక టీడీపీకి ప్రస్తుతం రాజ్యసభలో ఒకే ఒక్క సభ్యుడు ఉండగా ఆయన పదవీ కాలం ఈ ఏప్రిల్‌తో ముగియనుంది. దీంతో టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయినట్లు అవుతుంది. వైసీపీ తరపున వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ రెడ్డి, గొల్ల బాబూరావు రాజ్యసభకు నామినేషన్లు వేయగా నామినేషన్లకు చివరి తేదీ ఫిబ్రవరి 15. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఫిబ్రవరి 20 కాగా అప్పటివరకు టీడీపీ తరపున ఎవరూ నామినేషన్ వేయకపోతే వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అవడం ఖాయమే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -