ప్రస్తుతం మారుతున్న సమాజ పరిస్థితులు ప్రజల ఆరోగ్య విధానంపై ఎంతో ప్రభావం చూపుతున్నాయి. ఒత్తిడి వల్ల కావొచ్చు లేదా జంక్ ఫుడ్, టైంకు తినకపోవడం ఇలా ఏ కారణమైన అది ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతోంది. ఇక మానవ శరీరంలో అతి ముఖ్యమైనది కాలేయం(లివర్), మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయాలన్నా, శరీరానికి శక్తి సరిగ్గా అందాలన్నా, విష పదార్థాలు బయటికి వెళ్లాలన్నా లివర్ పనిచేయాల్సిందే. లివర్ చెడిపోతే శరీరంలోని అన్ని అవయవాల పనితీరు బ్యాలెన్స్ తప్పి చివరకు ప్రాణాలు కొల్పొయే ప్రమాదమే ఎక్కువ.
అయితే తెలిసి, తెలియక కొన్ని అలవాట్ల కారణంగా మన చేజేతులారా మన లివర్‌ని మనమే నాశనం చేసుకుంటున్నాం. మద్యపానం, ధూమపానం వల్ల లివర్ చెడిపోవడం ఎంత నిజమో మనం తీసుకునే ఆహార పదార్థాల కారణంగా కూడా కాలేయం చెడిపోయేందుకు అవకాశాలు ఎక్కువ.
అయితే మన శరీరంలో వస్తున్న కొన్ని మార్పుల ద్వారా లివర్ చెడిపొవడాన్ని గమనించవచ్చు. రక్త స్రావం, చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం (జాండీస్), విపరీతమైన దురద, ఆకలి లేకపోవడం, వికారం, కాళ్లు, పొత్తికడుపులోకి ద్రవం చేరి వాపు రావడం, ఏకాగ్రత సమస్యలు ఉన్నాయంటే లివర్ చివరి దశలో ఉన్నట్లు. అందేకే ఏ మాత్రం సందేహం ఉన్న వెంటనే సంబంధించిన డాక్టర్‌ని సంప్రదిస్తే ప్రాణపాయ స్థితి నుండి బయటపడవచ్చు.
