Saturday, May 4, 2024
- Advertisement -

అఫిషియల్…పోటీకి దూరంగా చంద్రబాబు!

- Advertisement -

ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపు ఏకగ్రీవమైంది. మూడు స్ధానాలకు గానూ మూడు వైసీపీ గెలుచుకోగా ఈ ఎన్నికలతో రాజ్యసభలో టీడీపీ తరపున ప్రాతినిధ్యం వహించే వారు లేకుండా పోయారు. ఇక టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే తొలిసారి.

వాస్తవానికి కొంతకాలంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై ఆశతో టీడీపీ పోటీ చేస్తుందని అంతా భావించారు. అయితే రెబల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే టికెట్ రాని వారు ఓటు వేసే అవకాశం లేకపోవడంతో పోటీ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. పైకి మాత్రం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపైనే ఫోకస్ ఉందని నేతలతో చెబుతున్నారు చంద్రబాబు.

పార్టీ నేతలతో సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా ఒకవేళ పోటీ చేస్తే ఎన్ని ఓట్లు రావాలి అనే దానిపై చర్చించగా అధకార వైసీపీకి చెందిన 20మందికిపైగా ఎమ్మెల్యేలు మద్దతివ్వాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి లేదు. ఇక రాజ్యసభ ఎన్నికల కోసం చూస్తే సార్వత్రిక ఎన్నికల్లో నష్టం జరిగే అవకాశం ఉంది.ఈ లెక్కలన్ని బేరీజు వేసుకున్న తర్వాతే రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -