Thursday, May 9, 2024
- Advertisement -

సినిమాలకు అనుష్క గుడ్‌బై!

- Advertisement -

బాలీవుడ్ నటి అనుష్క శర్మ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా?, తాజాగా మగబిడ్డకు జన్మనివ్వడంతో అనుష్క సినిమాలకు దూరమవడం ఖాయమని తెలుస్తోంది. ఈ నెల 15న అనుష్క పండంటి మగబిడ్డకు జన్మనివ్వగా తన కొడుకుకు అకాయ్ అని పేరు పెట్టినట్లు విరాట్ కోహ్లీ స్వయంగా వెల్లడించారు.

ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడంతో వారి పెంపకం, సంరక్షణలో బిజీ కానుంది అనుష్క. అందుకే సినిమాలు చేయడానికి పెద్దగా స్కోప్ ఉండకపోవచ్చు. దీనికి తోడు ఆమె చేతిలో ప్రస్తుతం ఎలాంటి సినిమాలు లేకపోవడంతో అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పినట్లేనని తెలుస్తోంది.

2017లో బాలీవుడ్ నటి అనుష్క శర్మను వివాహం చేసుకున్నారు కోహ్లీ. వీరికి మూడేళ్ల కూతురు వామిక ఉండగా ఇప్పుడు అకాయ్ జన్మించాడు. అయితే అనుష్క సినిమాలకు దూరమవుతుందనే వార్తలకన్నా మగబిడ్డకు జన్మనిచ్చారనే వార్తే ఫ్యాన్స్‌లో ఆనందాన్ని నింపుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -