Saturday, April 27, 2024
- Advertisement -

విరాట్ కొడుకు పేరేంటో తెలుసా?

- Advertisement -

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పాడు ఈ 15 న తమకు మగ బిడ్డ పుట్టినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇక తన కొడుకు పేరు అకాయ్ అని రివీల్ చేశారు. అకాయ్‌కి అందరి ఆశీర్వాదం కావాలని కోరగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

2017లో బాలీవుడ్ నటి అనుష్క శర్మను వివాహం చేసుకున్నారు కోహ్లీ. వీరికి మూడేళ్ల కూతురు వామిక ఉండగా ఇప్పుడు అకాయ్ జన్మించాడు. కొన్నిరోజులుగా అనుష్క ప్రెగ్నెన్సీ పై తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే దీనిని గోప్యంగా ఉంచగా ఏబీ డివిలియర్స్ రివీల్ చేయడంతో అందరికి తెలిసిపోయింది.

అనుష్క డెలివరీ ఉండటంతో ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు విరాట్. ప్రస్తుతం ఫ్యామిలీతో గడుపుతున్న విరాట్ త్వరలోనే జట్టుతో చేరనున్నారు. ఇక విరాట్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా సచిన్ టెండూల్కర్ సైతం స్పెషల్ విషెస్ తెలిపారు. అందమైన కుటుంబంలోకి అకాయ్ వచ్చినందుకు అభినందనలు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -