పవన్‌పై ఇమ్రాన్ కామెంట్స్ వైరల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఓజీ. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్‌కు పరిచయం అవుతుండగా ఓజీలో విలన్‌గా నటించనున్నారు ఇమ్రాన్. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

పవన్ కళ్యాణ్ తో బిగ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నానని..అయితే పవన్ చాలా వాయిలెంట్ కానీ చాలా కూల్ అని తెలిపారు. తొలిసారిగా సెట్స్ లో పవన్ కళ్యాణ్ ను చూసినప్పుడు తనకు కలిగిన ఫీలింగ్ ఇదేనన్నారు. ఈ సినిమాలో పవన్ నటనతో అందరికి నచ్చుతుందని చెప్పుకొచ్చాడు.

సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా ఓజీ విడుదల కాబోతోంది. తమన్ సంగీతం అందిస్తుండగా పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి.